Header Banner

భారీగా తగ్గిన బంగారం ధర.. ఒక్క రోజే ఏకంగా.. 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే?

  Tue Apr 08, 2025 10:37        Business

గత కొంతకాలంగా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజే ఏకంగా రూ. 1,500కుపైగా తగ్గింది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 91,450కి దిగి వచ్చింది. వారం రోజుల క్రితం ఈ ధర రూ. 93 వేల స్థాయిలో ఉండగా, తాజా తగ్గుదలతో రూ. 92 వేల దిగువకు పడిపోయింది. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతోనే పుత్తిడి ధర దిగి వచ్చినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై రూ. 280 తగ్గి రూ. 90,380గా నమోదైంది. పసిడితోపాటు వెండి ధరలు కూడా నిన్న దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ధర కిలోకు రూ. 3 వేలు తగ్గి రూ. 92,500కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర రూ. 1.03 లక్షలుగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో మదుపర్లు విక్రయాల వైపు మొగ్గుచూపుతున్నారు. ధరలు తగ్గడానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 10.16 డాలర్లు తగ్గి 3,027 వద్ద ఉండగా, వెండి 30.04 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai